calender_icon.png 14 November, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ శ్రమ ఫలితం కలకాలం నిలిచిపోతుంది

14-11-2025 05:06:06 PM

ఎమ్మెల్యే యెన్నంని ఘనంగా సన్మానించిన హైలే అద్దీస్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సంపూర్ణ అవగాహనతో మీరు పడుతున్న శ్రమ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కలకాలం నిలిచిపోతుందంటు హైలే అద్దీస్ ఆధ్వర్యంలో  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో  ఘనంగా శుక్రవారం సన్మానించారు. మహబూబ్ నగర్ నగరం లో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారానికి రూ 824 కోట్ల లను మంజూరు చేయించినందుకు పట్టణ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా హైలే అద్దీస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృషితో  మహబూబ్ నగర్ ఎంతో ప్రశాంతంగా ఉందని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు.  విద్య,  వైద్యం పైన గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి అభినందనీయమని, గత 70 వసంతాలుగా ఏ నాయకుడు చేయలేదని, ఎమ్మెల్యే చేసి చూపిస్తున్నారని అన్నారు. 

పిల్లలు మంచిగా చదువుకుంటే వారి భవిష్యత్తు, కుటుంబం , సమాజం బాగుంటుంది అని భావించిన ఎమ్మెల్యే విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు.  అనంతరం ఎమ్మెల్యే ని హైలే అద్దీస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు హైలే అద్దీస్ ప్రతినిధులు ఇసా అమోది, తదితరులు పాల్గొన్నారు.