1 April, 2026 | 11:09 PM

నేడు చైత్ర శుద్ద పౌర్ణిమ, హనుమత్ జయంతి

01-04-2026 09:35 PM

 సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు 

శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్  జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతులు

శివంపేట,(విజయక్రాంతి): గురువారంచైత్ర శుద్ద పౌర్ణిమ, హనుమత్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని శ్రీ గురు పీఠంలోని దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం, పంచవటి, శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో యధావిధిగా విశేష పూజలు నిర్వహించబడును. ఉదయం 6: 30 కు కాకడ ఆరతి ఏడు గంటలకు బాబా అభిషేకము అలంకరణ, బాబా ఉత్సవ విగ్రహానికి అభిషేకము అష్టోత్తర నామార్చన ఆరతి ఇవ్వబడుతుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి  దేవాలయంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకము శతనామామార్చన ఇవ్వబడుతుంది. మధ్యాహ్నం 12.30ని.లకు  బాబా మధ్యాహ్న ఆరతి ఉంటుంది.

తదనంతరం అరగంటసేపు సాయి దేవాలయంలో సత్సంగ్ నిర్వహించబడును. ఆ తదుపరి జీడిమెట్ల వాస్తవ్యులైన మేడ్చల్ జిల్లా దయానంద్ స్వరూప దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ చేయగలరని భక్త మహాశయులందరికీ తెలియజేస్తున్నాం. భక్తులందరూ ఆయా పూజ సమయాల అనుసరించి దేవాలయానికి విచ్చేసి దత్త గురువుల ఆశీస్సులు పొందాలని మీ అందరికీ శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి,  శ్రీ జి సూర్య కుమార్ గౌడ్,, సిజి శ్రీనివాస్ గౌడ్ శ్రీ వై రమణ గౌడ్, మహేష్ గుప్తా, శ్రీశాస్త్రలవామన శర్మ, శ్రీ మారేళ్ల మోహన్ రావు , శ్రీ నోముల  హనుమంతు, శ్రీ రాజ్యం బిక్షపతి ఆ గురుదేవులను ప్రార్థిస్తున్నారు.