13 May, 2026 | 1:31 AM

వైభవంగా హనుమాన్ జయంతి

13-05-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు, మే 12 : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయం, చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు.

నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేశారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కంకర శ్రీనివాస్, ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.