27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

హ్యపీ బర్త్ డే

16-11-2024 12:00 AM

నటి ఆమని పుట్టినరోజు నేడు. ఆమె 1973 నవంబర్ 16న నెల్లూరులో జన్మించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకిడి పంబ’ చిత్రం ద్వారా ఆమని సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత ‘మిస్టర్ పెళ్లాం’ చిత్రం ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డ్ అందుకున్నారు. 1997 తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తిరిగి 2004లో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమని బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. 

* ఇవాళ ఎస్‌ఎస్ తమన్ పుట్టినరోజు. ఆయన 1983 నవంబర్ 16న ఏపీలో జన్మించారు. నెల్లూరు జిల్లా సంగీత కారుల కుటుంబానికి చెందినవారు. తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. ‘కిక్’ సినిమాకు తొలిసారిగా ఆయన సంగీతం అందించారు. బృందావనం, మిరపకాయ్ వంటి చిత్రాలు ఆయనకు బ్రేక్ ఇచ్చాయి. ప్రస్తుతం అయితే తెలుగు, తమిళ్‌లో టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.