calender_icon.png 1 July, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు

12-10-2024 12:01:03 AM

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): దసరా పండగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు.

దసరా రోజున కుంటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకొని, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కుటుంబ బంధాన్ని తెలియజేస్తుందన్నారు. 

 ప్రజలకు కేసీఆర్ విషెస్.. 

మనిషి తనలోని చెడు మీద నిత్య పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి తెలియజేస్తుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.