5 March, 2026 | 7:41 PM

మహిళా సంఘాల పాత బకాయిలు వసూలు

05-03-2026 06:04 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఐకెపి ద్వారా క్లస్టర్ల వారీగా వివిధ గ్రామాల్లో రెండవ రోజు రికవరీ టీములు పాత బకాయిలు వసూలు చేసినట్లు మండల ఇన్చార్జ్ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ...చిన్న లోన్లు కట్టి,పెద్ద లోన్లను తీసుకోవాలనే నినాదంతో గ్రామాలలో వెళ్లి రికవరీ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మహిళా సంఘాల ద్వారా లోన్లు,శ్రీనిధిల ద్వారా తీసుకున్న రుణాలను మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామ సంఘంలో 23,100/-తాండూర్ 21,300/ధర్మారెడ్డి 8000/-నాగిరెడ్డిపేట్ 10,000/-పోచారం 22,000/- జలార్పూర్ 1,33,700 గ్రామాల ద్వారా పాత బకాయిలు 2,18,100 రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు.పాత బకాయిలు కడితే వెంటనే కొత్త రుణం మంజూరు అవుతుందని గ్రామాలలోని సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్,ఆయా గ్రామాల సర్పంచులు వర్షిని, యాద గౌడ్,గులపల్లి లక్ష్మీనారాయణ,మన్నె వెంకట్,సంజీవరావు,శ్రీనివాస్ గౌడ్,సీసీలు దత్తు,రమేష్, నారాయణ,వివోఏలు తదితరులు పాల్గొన్నారు.