ఉపాధి అవకాశాలపై అవగాహన
నిర్మల్(విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని చించోలి–బి గ్రామంలో గల మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ (RAMP) ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం (PMEGP) పై అవగాహన కార్యక్రమం ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ (EDC), నిర్మల్ ద్వారా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, TSWCDC విజయలక్ష్మి లు హాజరై PMEGP, PMFME పథకాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. యువత ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార ప్రణాళిక మరియు ఎంటర్‌ప్రెన్యూర్షిప్ నైపుణ్యాలపై పాల్గొనేవారికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో EDC మేనేజర్ శ్రీ అభినయ్ దీప్, అసిస్టెంట్ మేనేజర్ తేజేశ్వి, తదితరులు పాల్గొన్నారు.




