5 March, 2026 | 9:11 PM

శ్రీ కల్కి భగవాన్ జన్మదిన వేడుకలకు ఆహ్వానం

05-03-2026 05:55 PM

హనుమకొండ,(విజయక్రాంతి): శ్రీ కల్కి భగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మార్చి ఏడవ తారీఖున శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీ కల్కి సేవా సమితి సభ్యులు జొన్నల రాజు తెలిపారు. గురువారం హనుమకొండ  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జొన్నల రాజు మాట్లాడుతూ శ్రీ కల్కి భగవాన్ దివ్య జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, లోక కల్యాణార్థం, మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు, ముక్తి చైతన్యం సిద్దించాలని సంకల్పిస్తూ "శ్రీ కల్కి భగవాన్ సహస్ర కలశ సంపూర్ణ క్షీర పాదుకాభిషేకము" అనే అద్భుత ఆధ్యాత్మిక క్రతువును నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమం మార్చి ఏడవ తారీఖు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం  2:30 గంటల వరకు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి శ్రీ భగవాన్ శిష్యులైన శ్రీ త్విష దాసాజీ పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దివ్య క్రతువును దర్శించి, భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కల్కి సేవా సమితి సభ్యులు జొన్నల సోమేశ్వర్,గోల్డ్ రాజు, నరేష్ ,రంజిత్,మహేష్,తదితరులు పాల్గొన్నారు.