3 March, 2026 | 7:20 PM

ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డికి హోలీ పండుగ శుభాకాంక్షలు

03-03-2026 05:23 PM

చీర్ల దయానంద్ యాదవ్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల భూకే అందించి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హోలీ పండుగను పురస్కరించుకొని బోయిన్ పల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతికి సౌరతృత్వానికి ప్రతీకనని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక హోలీ పండుగను ఆయన కొనియాడారు. రంగుల హోలీ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో సంబరామాయంగా కావాలని భగవంతుడిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ శాఖ మాజీ అధ్యక్షులు బాసురాది భాస్కర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.