3 March, 2026 | 7:32 PM

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు

03-03-2026 05:27 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా  స్పందించారని ఆయన తెలిపారు.