25 June, 2026 | 1:01 AM

మొక్కజొన్న క్వింటాల్ @ రూ.2,330

25-06-2026 12:21 AM
  1. రోజురోజుకు పెరుగుతున్న ధర 
  2. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట 

మహబూబాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): మొక్కజొన్న ధర గత నాలుగు రోజులుగా రోజురోజుకు పెరుగుతూ బుధవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో ఏకంగా క్వింటాల్‌కు 2,330 ధర లభించింది. గత ఏడాది గరిష్టంగా క్వింటాలకు ఈ నెలలో 2,300 రూపాయలు లభించింది. ఇప్పుడు 2300 రూపాయల ధర దాటిపోవడం విశేషంగా చెబుతున్నారు.

మొక్కజొన్నలకు యాసంగిలో ప్రైవేటు ట్రేడర్లు క్వింటాల్కు కేవలం 1700 నుంచి 1800 రూపాయల ధర మాత్రమే పెట్టడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధర 2,400 చొప్పున చెల్లించి మక్కలను సేకరించింది. గత నాలుగు రోజుల నుంచి మక్కల ధర రోజుకు కొంత చొప్పున పెరుగుతూ 2,300 పైగా పలుకుతుండడంతో ప్రభుత్వానికి కాస్త ఊరటగా మారింది. రైతుల నుంచి సేకరించిన మక్కలను ఎక్కడికక్కడే నిల్వ చేయించింది. ధర పెరుగుతుండడంతో ఈసారి మొక్కల కొనుగోళ్ల సేకరణలో ప్రభుత్వానికి నష్టం కొంత తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.