11 May, 2026 | 12:15 PM

Breaking News

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •  

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

13-01-2025 02:34 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాం తి): తెలంగాణతో పాటు తెలుగు ప్రజలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు. భోగభాగ్యాలు తెచ్చే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించా రు. రాష్ట్రంలోని కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందన్నారు.

కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా పథకాలకు సంక్రాంతి నాంది పలుకుతోంద ని పేర్కొన్నారు. అర్హులైన అందిరికీ సంక్షేమ పథకాలు చేరాలన్నదనే తన సంకల్పమన్నా రు. వ్యవసాయంతో పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.