11 May, 2026 | 11:23 AM

Breaking News

తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు

11-05-2026 10:41 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ట్రంప్ చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జెన్ పింగ్ ఆహ్వానం మేరకు ట్రంప్ పర్యటిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు(White House sources) వెల్లడించాయి. ఈ నెల 14న షీ జిన్ పింగ్, ట్రంప్ ద్వైపాక్షిక చర్యలు జరపనున్నారు.

చైనా చారిత్రక కట్టడం 'టెంపుల్ ఆఫ్ హెవెన్'(Temple of Heaven)ను ట్రంప్ సందర్శించనున్నారు. ఇరుదేశాల టారిఫ్, ఎగుమతులు, దిగుమతులపై చర్చించే అవకాశముంది. తైవాన్ అంశం, సెమీకండక్టర్ల సరఫరాపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) చైనాలో పర్యటిస్తున్నారు. ఇరాన్ ఆర్థిక, ఇంధన రంగాలను లక్ష్యంగా చేసుకుని గత వారం ప్రకటించిన కొత్త అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ ఆంక్షలు టెహ్రాన్‌పైనా, చైనాతో దాని వాణిజ్య సంబంధాలపైనా ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయి. 

ట్రంప్ చైనా పర్యటన: షెడ్యూల్ వివరాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సాయంత్రం బీజింగ్‌కు చేరుకోనున్నారు.

గురువారం ఉదయం ప్రారంభోత్సవం, సాయంత్రం అధికారిక విందు జరుగుతుంది.

శుక్రవారం బయలుదేరే ముందు ఇరు దేశాల మధ్య తేనీరు, వర్కింగ్ లంచ్ చేస్తారు.

అమెరికా, చైనాలు సంయుక్త వాణిజ్య మండలి, పెట్టుబడుల మండలిపై కలిసి పనిచేస్తాయని, అలాగే ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలపై చర్చిస్తారు.

2026లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను పరస్పర పర్యటనకు ఆహ్వానించాలని ట్రంప్ యోచిస్తున్నారని ప్రతినిధి తెలిపారు.