ఘనంగా మహిళా దినోత్సవం
సర్దార్ శ్రీ జలగం వెంగళరావు భవనం, సత్తుపల్లి మున్సిపాలిటీలో వేడుకలు
సత్తుపల్లి, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం సత్తుపల్లి లో ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా సత్తుపల్లి మున్సిపల్ కార్మికులకు ఎండలు తీవ్రతరంగా ఉన్న దృష్ట్యా ప్రతిరోజు ఉదయం కార్మికులకు రాగి జావా, జొన్న జావా అందించాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
వారు పనికి వెళ్లే ముందు కార్మికుల ఆరోగ్య దృష్ట్యా సత్తుపల్లి ఎమ్మెల్యే ఆదేశాలు ప్రకారం నూతన మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా , వైస్ చైర్మన్ బొంతు సుమలత ప్రతిరోజు ఉదయం కార్మికులకు రాగి జావ, జొన్న జావా అందించడం జరుగుతుందని తెలియజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కార్మికులకు జావా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్మన్ రిహాన్ బేగం లను సన్మానించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ST గరల్స్ హాస్టల్లో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులకు కలిసి హాస్టల్లో అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహన బేగం, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, మహిళా మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్మికులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.




