మహిళా ప్రతిభకు వేదిక హైబిజ్
ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్స్ ప్రదానం
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి హాజరు
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైబిజ్ టీవీ నిర్వహించిన 7వ ఎడిషన్ ఉమెన్స్ లీడర్షిప్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నో వాటెల్‌లో ఘనంగా జరిగింది. ఏడో ఏడాది నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 60 మందికి పైగా మహిళలను సత్కరించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటే ల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీ బోర్డ్ ఆఫ్ ఇండియా కూనూర్ జోనల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరణి కుమార్ ఐఏఎస్, సోషలైట్ గణపురం కావ్య కిషన్‌రెడ్డి, మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 విజేత మిస్ కాశ్వి, స్ట్రీనిధి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీనాథ్, పెరం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రీష్మ బాథలా పెరం, కిమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డా. శ్వేత బొల్లినేని హాజరయ్యారు. హైబిజ్ టీవీ నిర్వహిస్తున్న ఉమెన్స్ లీడర్షిప్ అవార్డ్స్‌ను పటేల్ రమేష్‌రెడ్డి అభినందించారు. అవార్డు గ్రహీతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తమ కృషిని గుర్తించి గౌరవించిన హైబిజ్ టీవీకి కృతజ్ఞతలు తెలిపారు.




