8 August, 2026 | 6:21 PM

బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి

08-08-2026 04:36 PM

ఆదివాసి మండల ప్రధాన కార్యదర్శి  మనోజ్

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మా ముత్తారం మండలం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జయప్రదం చేయాలని ఆదివాసి మండల ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. బోర్లగుడెం కేంద్రం లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొలం రాజేందర్, మాట్లాడుతూ... మహాముతారం మండల లోని బోర్లగుడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి అని అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రం లో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అన్నారు 

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు జరపాలి అని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు బోర్లగూడెం కేంద్రంలో ఆదివాసీ పెద్దమనిషి ఇనుముల సమ్మయ్య జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం ఆగస్టు  జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడ్ కోయ చెంచు ,వలస ఆదివాసి తెగల యొక్క సంస్కృతి సంప్రదాయాలతో బారి ర్యాలీ ప్రదర్శన జరుగుతుందని అన్నారు. దీని అనంతరం బారి బహిరంగ సభా అన్ని ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

జిల్లాలోని ఆదివాసులకు సంబంధించిన కళ రూపాలు పట్టుకొని ఇంటి కో మనిషి ఊరు కో బండి పట్టుకొని బారి సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. బోర్లగూడెం కేంద్రంగా ఆదివాసీ మండలంగా ఏర్పాటు చేసి 5వ సెడ్యూల్ హక్కులని వర్తింప చేయాలని అన్నారు ఆదివాసీ నాయకపోడ్ తెగను ప్రత్యేక నెంబర్ ను కేటాయించి అత్యంత వెనుకబడ్డ పి వి టి జి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు మహాముతారం మండల కార్యదర్శి మద్ద మనోజ్ ఉపాధ్యక్షులు గంప లక్ష్మణ్. బోర్లగుడెం గ్రామ అధ్యక్షులు ఎర్నేని సూరయ్య .మాజీ సర్పంచ్ బైరి కొమ్మయ్య గుండ్ల రాజబాబు ఇనుముల సమ్మయ్య ఇనుముల చిరంజీవి బొడ్డు లస్మయ్య కాపుల అశోక్ అశోధుల రవి ఇనుముల పోషం ఇనుముల మల్లయ్య ఇనుముల స్వామి ఇనుముల రాంబాబు సిగినవేని రాజు తదితరులు పాల్గొన్నారు