13 August, 2026 | 4:33 PM

సంబరంగా.. హర్ ఘర్ తిరంగా ర్యాలీ

13-08-2026 02:58 PM

బాలానగర్: మండల కేంద్రంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీలో బీజేపీ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని, చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ర్యాలీగా సాగుతూ జాతీయతా భావాన్ని చాటారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి వంగూరి యాదయ్య, సాటి శ్రీనివాస్, సాయికుమార్, కుమార్ చారి, కుమార్ నాయక్, బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.