3 August, 2026 | 7:32 PM

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

24-08-2024 12:30 AM
  1. రాచకొండ సీపీ సుధీర్‌బాబు 
  2. 15 రోజుల్లో 122 మంది ఆకతాయిల అరెస్టు

ఎల్బీనగర్, ఆగస్టు 23: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఉమెన్ సేఫ్టీ వింగ్, షీటీమ్ డీసీపీ ఉషావిశ్వనాథ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 122 మంది ఆకతాయిలను అరెస్టు చేశామన్నారు. వారికి ఎల్బీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో షీటీం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళలు, యువతులను వేధిస్తున్న 122 మందిలో 73 మంది మేజర్లు, 49 మంది మైనర్లు ఉన్నారని సీపీ తెలిపారు.