3 August, 2026 | 6:31 PM

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

24-08-2024 12:08 AM
  1. పోలీసుల అదుపులో ఇద్దరు.. పరారీలో నలుగురు 
  2. 60 కిలోల గంజాయి, కారు స్వాధీనం

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 22 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తు న్న అంతరాష్ట్ర ముఠాను యాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కేపీవీ రాజు వివరాలు వెల్లడిం చారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి వద్ద 60 కిలోల గంజాయిని రూ.3 లక్షలకు  కొర్ర బాబురావు, బురుండి కామేశ్వర్‌రావు, షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మల్లేశ్వర్‌రావు నలుగురు కొని బెంగురులోని గిరీష్‌కు అమ్మేందుకు గురువారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం మీదుగా బెంగుళూరుకు వెళ్లేందుకు కారులో బయలుదేరారు.

మార్గమధ్యంలో పోలీసులు తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని కారును హైద రాబాద్ వైపు తరలించారు. ఈ నేపథ్యంలో మాల్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తు న్న పోలీసులకు పట్టుబడ్డారు. పోలసుల అదుపులో కొర్ర బాబురావు, కామేశ్వరరావు ఉండ గా షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మల్లేశ్వరరావు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి నుం చి 60.420 కిలోల గంజాయి, కారు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

11కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో(విజయక్రాంతి): ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి ఆధ్వర్యంలో లోయర్ ధూల్‌పేటలోని జుం గూర్ బస్తీలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ధరమ్‌సింగ్ అనే ప్రధాన సరఫరాదారు ఇంట్లో 11కిలోల గంజాయిని, ద్విచక్రవాహనాన్ని, రెండు మొ బైల్స్‌ను  స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అందులో కమలాబాయి, దుర్గాసింగ్, దివ్యాసింగ్, దీక్షసింగ్, నేహాసింగ్‌లను అరెస్ట్ చేశా రు. దీపక్‌సింగ్, మహేష్‌సింగ్, సంగీత సాహు పరారయినట్లు అధికారులు తెలిపారు.