పారిశుద్ధ్య కార్మికుల శ్రమ శ్రమ వెలకట్టలేనిది
నగరపాలక సంస్థలో దూకుడు పెంచిన పారిశుద్ధ కార్మికులు..
కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని(Bhadradri Kothagudem District) జంట నగరాల గా పేరుందిన పాల్వంచ కొత్తగూడెం పట్టణాలలో, పారిశుద్ధ కార్మికులు నిత్యం మనకు తచ్చాడుతూనే ఉంటారు. మునిసిపల్ శాఖ నుండి నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందిన తర్వాత,పారిశుద్ధ కార్మికుల పనిలో దూకుడు పెంచారని చెప్పుకోవాలి. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారుల ఆధ్వర్యంలో, జవాన్ ల నేతృత్వంలో ఉదయం 5 గంటల నుండి మొదలు వీరి శ్రమ,నిత్యం ఎన్నో పారిశుద్ధ కార్యక్రమాల పై నిమగ్నమై, రోడ్లన్నీ వీధులని, పరిసర ప్రాంతాలని,శుభ్రపరచడంలో వీరి పాత్ర ఎంతో కీలక మైందని చెప్పవచ్చు. వీరి శ్రమను గుర్తించే వారు కరువయ్యారు,వీరికి కనీస సౌకర్యాలు ఏర్పరచటం కార్పొరేషన్ నగరపాలక సంస్థ బాధ్యతగా భావించాలి.
ఉదయం వేల నేషనల్ హైవేపై, అలాగే పరిసర ప్రాంతాల్లో పొదల మధ్యన, చెట్ల మధ్యన, వీరు పని చేస్తుంటారు,అటువంటి సమయంలో రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలం వీరికి చాలా ప్రాణ సంకటంగా ఉండనుంది. రకరకాల క్రిమి కీటకాలు,వీరి పై దాడి చేసే అవకాశం ఉంది. దీనిపై నగరపాలక సంస్థ ఆలోచించి తగిన ఏర్పాట్లు చేసి, పరిసర ప్రాంతాలకు పనిలోకి పంపాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో రకరకాల అంటూ రోగాలు ప్రబలే, అవకాశం లేకపోలేదు. మరి వీరికి తగినన్ని జాగ్రత్తలతో కూడినటు వంటి రక్షణ కవచాలు ఏర్పరిచి వారిని పారిశుద్ధ పనులకు నియమించినట్లయితే, వారి ఆరోగ్యాన్ని రక్షించిన వార మవుతాం. వీరికి పనిలో ఇంకాస్త దూకుడు పెంచి పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడంలో వీరి పాత్ర ఎంతో కీలకమైంది. పారిశుద్ధ కార్మికులపై చిన్న చూపువీడి కనీస సౌకర్యాలు కల్పించాలని పట్టణ ప్రజలు, మేధావులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






