9 May, 2026 | 6:48 PM

Breaking News

ధాన్యం అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి   •   పూసాలలో భక్తి పారవశ్యంతో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర   •   సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన బిజెపి నాయకులు   •   కారులో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్   •   ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి: తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు   •   చిన్న కాంట్రాక్టర్ల పొట్టకొట్టే కుట్ర..!   •   తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లీయర్.. విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్   •   అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ   •   మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   మొక్కజొన్నను సత్వరమే రవాణా చర్యలు చేపట్టాలి   •  

కార్మికుల పక్షపాతిగా బిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది

09-05-2026 05:55 PM

సరైన ధరలు లేకపోవడంతో సెంట్రింగ్ కార్మికుల అవస్థలు

మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): కార్మికుల పక్షపాతిగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని ప్రజా పాలనలో కార్మికులకు పనులు దొరకకపోవడంతో పూట గడవడం కష్టమవుతుందని సెంట్రింగ్ కార్మికులు రోడ్ల మీదకి వచ్చే రోజులు వస్తున్నాయని సరైన ధరలు పెంచి ఆదుకోవాలని తెలంగాణ  ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిమాండ్ చేశారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ సెంట్రింగ్ కార్మికులకు సరైన ధరలు చెల్లించాలని కోరుతూ మాజీ మేయర్ మేకల కావ్య యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరామ్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని వారి బాధలను పట్టించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 16 నుండి సమ్మె చేస్తామని కార్మికులు తెలిపారు. కార్మికులు తమ డిమాండ్లను వినతి పత్రంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ కార్మికులు పాల్గొన్నారు.