15 August, 2026 | 12:06 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి.. అస్వస్థతకు గురైన మంత్రి ఆనం

15-08-2026 11:15 AM

తిరుపతి: తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ(80th Independence Day) వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(Minister Anam Ramanarayana Reddyతిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆనం రామనారాయణ రెడ్డి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఆనం ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని పట్టుకుని కిందపడకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆనం రామనారాయణరెడ్డిని అధికారులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆనం ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.