2 May, 2026 | 8:50 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

బీఆర్‌ఎస్ నాయకులపై దాడి ఘటనను ఖండించిన హరిప్రియ

16-03-2026 12:01 AM

ఇల్లందు టౌన్, మార్చి 15, (విజయక్రాంతి): ఇల్లంద మండలం తిలక్నగర్ గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ నాయకులపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ ఖండించారు. రోడ్డు పనుల్లో నాణ్యతపై ప్రశ్నించినందుకు సర్పంచ్ ధనసరి స్రవంతి భర్త రాజు బీఆర్‌ఎస్ నాయకులపై దాడి చేశారని ఆరోపించారు. గాయపడిన వారిపైనే కేసులు నమోదు చేయడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శీలం రమేష్, ఘాజీ, విజయ్ కుమార్, గుదిబండ్ల శ్యామ్, సదరం చిన్నారి తదితరులు పాల్గొన్నారు.