ప్రకృతి వైద్యాన్ని అందరూ అలవర్చుకోవాలి
జిల్లా యోగాసన స్పోరట్స్ అసోసియేషన్ అధ్యక్షులు యోగ రామ్ రెడ్డి
కామారెడ్డి, మార్చ్ 15 (విజయక్రాంతి): ప్రకృతి వైద్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా యోగా స్పోరట్స్ అసోసియేషన్ అధ్యక్షులు యోగ రామ్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి లో కామారెడ్డి జిల్లా యోగసన స్పోరట్స్ అసోసియేషన్, భారత్ స్వాభిమాన్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగ స్పోరట్స్ జిల్లా అధ్యక్షుడు పైడి రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైద్యంలో అత్యంత కీలకమైన ది మాటే స్నానం అని అన్నారు. 130 మంది మట్టి స్నానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వినూత్న కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి యోగ సాధకులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ఆధునిక జీవనశైలిలో మానవుడు ప్రకృతికి దూరమవుతున్నాడని తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. మట్టి స్నానం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదని ఇది ఒక అద్భుతమైన చికిత్స అని వివరించారు.
మట్టి స్నానం వల్ల చర్మ ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతలు, నిశీకరణ, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రకృతి వైద్యాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు బాస రఘుకుమార్, రాజకుమార్, రమేష్, సిద్ద గౌడ్, ఎల్లయ్య, పెట్టిగాడి అంజయ్య, అంతి రెడ్డి, బద్దం అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




