4 April, 2026 | 10:51 PM

గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరిప్రియ నాయక్

04-04-2026 08:43 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తీవ్రంగా ఖండించారు. కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. గాంధీ వాదం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దాడులు, విధ్వంసాలు పెరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని తెలిపారు. పోలీసులు తగిన రక్షణ కల్పించాలన్నారు.