21 April, 2026 | 6:04 PM

Breaking News

నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •  

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!

21-04-2026 04:58 PM

హైదరాబాద్: సీఎం అంటే చాలా హుందాగా వ్యవహరించాలని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. కేసీఆర్ సభ పెట్టుకున్న రోజే.. రేవంత్ రెడ్డి సభ పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడటం ప్రారంభించగానే రేవంత్ రెడ్డి మైకు అందుకున్నారని తెలిపారు. యూట్యూబ్ లో కేసీఆర్ ప్రపంగాన్ని 36 లక్షల మంది చూస్తే.... సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది చూశారన్నారు. ఎవరి రేటింగ్ ఏంటి.. ఎవరి స్థాయి ఏంటో నిన్న ప్రజలకు అర్థమైందని తెలిపారు.

కేసీఆర్ 50 నిమిషాల ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) పేరు ఎక్కడా ఎత్తలేదని వివరించారు. కేసీఆర్ స్టేట్ మెన్ గా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రీట్ మెన్ గా మాట్లాడారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మళ్లీ గెలవదు కానీ.. మిగతా రెండున్నరేళ్లు బాగా పాలిస్తే.. కనీసం డిపాజిట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా చిల్లర ప్రచారం చేశారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడి సూచన మేరకే.. ఢిల్లీకి వెళ్లి లాయర్లను కలిశానని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే ఢిల్లీకి వెళ్లి లాయర్లను కలిశాని పేర్కొన్నారు.

కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు హరీశ్ రావు వివరించారు. ఓటుకు నోటు కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని ఆయన వెల్లడించారు. ఓటుకు నోటు కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని హరీశ్ రావు తెలిపారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) ఇంప్లీడ్ అయ్యారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో హోంశాఖ తరుఫున అనామక లాయర్ ను పెట్టారని ఆరోపించారు. నిందితుల తరుపున పేరు మోసిన లాయర్ ముకుల్ రోహత్గీని పెట్టుకున్నారని వివరించారు. రేపటి విచారణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి, ముద్దాయిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా రేవంత్ రెడ్డి స్టే మీద ఉన్నారని హరీశ్ రావు వివరించారు.

రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాత్రి రాహుల్ గాంధీతో(Rahul Gandhi), ఉదయం బీజేపీ వాళ్లతో తిరిగారని ఆరోపించారు. కేసీఆర్ నిన్న బయటికి వచ్చినందుకే ఒక్క ఎకరానికి రైతుభరోసా వేశారని వెల్లడించారు. పంట పెట్టుబడిగా ఇవ్వాల్సింది.. పంట చేతికి వచ్చాక వేశారని చురకలంటించారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం చేశారు. రెండు పిల్లర్లు కుంగిపోయాయి.. మరమ్మతులు చేస్తామని నిన్న చెప్పారని వివరించారు. వచ్చే ఏడాది ఎల్ నినో రానుందని తెలియడంతో మేడిగడ్డ అవసరం తెలిసిందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్(Kondapochamma Sagar) కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని హరీశ్ రావు ప్రశ్నించారు.