16 July, 2026 | 5:17 PM

యాదగిరిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

03-07-2024 03:23 PM

హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు మృతి చెందడాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉపాధిలేక ఉరేసుకుని యాదగిరి ఆత్మహత్య చేసుకోవడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన పేర్కొన్నారు. 

యాదగిరిది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని కేటీఆర్ చెప్పారు. రేవంత్ పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆత్యహత్య చేసుకున్న చేనేత కుంటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.