calender_icon.png 19 February, 2026 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైల్లో బాల్క సుమన్‌కు హరీష్ రావు పరామర్శ

19-02-2026 04:37:40 PM

హైదరాబాద్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు బాల్క సుమన్(Harish Rao consult Balka Suman) ను జైలులో పరామర్శించారు. ఆదిలాబాద్ జైలులో బాల్క సుమన్‌ను కలిసిన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) కనుసన్నల్లో అధికారులు కావాలని కౌన్సిల్ ని వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం చేత పట్టుకునే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదన్నారు. గవర్నర్ స్పందించి క్యాతనపల్లి ఎన్నిక వాయిదాపై విచారణ చేపట్టాలని హరీశ్ రావు కోరారు. 

మంచిర్యాల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్( Balka Suman), మరో ముగ్గురి అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్‌వీ పిలుపునిచ్చిన బంద్ గురువారం జిల్లా అంతటా ప్రశాంతంగా కొనసాగింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లా అంతటా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సహా వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. జిల్లా కేంద్రంలోని క్యాతన్‌పల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి పట్టణాల్లోని కీలక జంక్షన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు. మండల కేంద్రాల్లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. బాల్క సుమన్‌ను అరెస్టు చేసి ఆదిలాబాద్ జైలులో ఉంచినందుకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  బాల్క సుమన్ అరెస్టు, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను ఖండించారు.