calender_icon.png 30 December, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై పోరాటం చేశాం

30-12-2025 04:49:46 PM

  1. తెలంగాణ ఇంకా మేల్కోలే
  2. గట్టిగా పోరాటం చేశాం.. సీఎం వెళ్లి సంతకం చేశారు
  3. రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే
  4. బనకచర్లపై ఏపీ ఎందుకు వెనక్కి తగ్గిందో చెప్పిన హరీశ్ 
  5. ఆ విషయం రేవంత్ ప్రభుత్వానికి తెలియదు
  6. ఏపీ వల్ల తెలంగాణకు రెండు రకాలుగా నష్టం
  7. చంద్రబాబు కమిటీ వేసిన వారానికే రేవంత్ కమిటీ

హైదరాబాద్: బనకచర్ల(Banakacherla) వల్ల తెలంగాణకు అన్యాయం అని గట్టిగా పోరాటం చేశామని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తెలంగాణ భవన్ లో మంగళవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించామని గుర్తుచేశారు. సమావేశానికి వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి మీటింగ్ కు వెళ్లి సంతకం చేశారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ సమావేశం అజెండాలో గోదావరి-బనకచర్ల అంశం(Godavari-Banakacherla issue) ఉందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కలిసి కమిటీ వేసుకుని ముందుకెళ్తాయని ఏపీ మంత్రి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో తల ఊపి బయటికి వచ్చి అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు ఆరోపించారు. బనకచర్లను ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనక్కు తీసుకున్నదో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదన్నారు. గోదావరి నీళ్లు(Godavari water) కృష్ణాలో కలిపితే.. ఆ మేరకు మనకు అదనంగా నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు. గోదావరి-బనకచర్లపై కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాశాయని తెలిపారు. 64 టీఎంసీలు కోరుతూ కర్నాటక, 21 టీఎంసీలు కోరుతూ మహారాష్ట్ర లేఖ రాశాయని పేర్కొన్నారు.

కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాయడంతో బనకచర్లపై ఏపీ వెనక్కి తగ్గిందని చెప్పారు. కృష్ణాలో కలపకుండా నల్లమల్లసాగర్ లో కలపాలనేది ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ఆలోచన అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ను తప్పించుకునేందుకు మరో రూపంలో ఏపీ ప్రాజెక్టు చేపడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమల్లసాగర్ వల్ల తెలంగాణకు రెండు  రకాలుగా నష్టం ఉందని హరీశ్ రావు హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్ర మేల్కున్నాయి గానీ.. తెలంగాణ ఇంకా మేలుకోలేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం-బనకచర్ల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలు వేశాయని చెప్పారు.

చంద్రబాబు కమిటీ వేసిన వారానికే రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా ఒక కమిటీ వేశారని చెప్పారు. చంద్రబాబు వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఏడుగురితో రేవంత్ రెడ్డి కమిటీ వేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వేసిన కమిటీలో ఆరుగురు ఏపీతో సంబంధం ఉన్నవారే ఉన్నారని వివరించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఆదిత్యానాథ్ దాస్(Adityanath Das) నేతృత్వంలో కమిటీ వేశారని చెప్పారు. చంద్రబాబు సూచన మేరకే ఆదిత్యానాథ్ దాస్ ను సలహాదారుగా రేవంత్ రెడ్డి నియమించుకున్నారని తెలిపారు. గోదావరి-నల్లమల్లసాగర్ కు ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా వేసిందని హరీశ్ రావు వెల్లడించారు. టెండర్ల గడువు ముగిసిన తర్వాత ఈ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు వెళ్లిందని హరీశ్ రావు మండిపడ్డారు. ఒప్పుకుని కమిటీ వేశాక.. సుప్రీంకోర్టు(Supreme Court) కేసు వేస్తే ఏ ప్రయోజనం అని హరీశ్ రావు రేవంత్ సర్కాన్ ను ప్రశ్నించారు.