calender_icon.png 30 December, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో నీటి సమస్యలు పరిష్కరించాలి

30-12-2025 04:48:04 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఐఎన్టియుసి ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావ్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కు వినతిపత్రం సమర్పించారు. డిసి కొత్తగా వచ్చిన సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి వినతి పత్రం అందజేశారు. పట్టణంలో చాలా కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ట్యాంకర్ నీటిని కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. నీటి సరఫరాను మెరుగుపరచాలని, పేద ప్రజల కాలనీలకు ట్యాంకర్లు నడపాలని కోరారు.