calender_icon.png 30 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవిత పర్యటనను విజయవంతం చేయాలి

30-12-2025 04:52:32 PM

కోదాడ: జనవరి 4వ కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా జాగృతి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో మీడియా మిత్రుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు.

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనవరి 4న గ్రామగ్రామానికీ వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ పర్యటన ద్వారా ప్రజల గొంతుకగా జాగృతి నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు భూక్య సంజు నాయక్,తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కందుల మధు, జితేందర్, గోపి, నరసింహ,నరేందర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.