18 March, 2026 | 11:59 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

03-08-2024 10:35 AM

హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లులేక అడుగంటిపోతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మలో నీళ్లులేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని జలాశయాల్లో చాలా తక్కువ నీరు ఉందన్నారు. జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలలో ఉన్నారన్నారు. పంటలు వేయాల.. వద్దా.. అనే అయోమయంలో రైతులున్నారని, మధ్య మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని హరీశ్ రావు కోరారు.