18 March, 2026 | 11:03 AM

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్

18-03-2026 09:37 AM

పిర్యాదు చేసిన పట్టించుకొని తహసిల్దార్ 

అడ్డుకున్నవారికి బెదిరింపులు... 

సిద్దిపేట (విజయక్రాంతి):  సిద్దిపేట పట్టణ శివారుణ గుండ్ల చెరువు వద్దగల డబుల్ బెడ్ రూమ్ ల మధ్య ఖాళీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఖాళీగా ఉన్న స్థలంలో తప్పుడు దృవీకరణ పత్రాలు తీసుకొచ్చి కబ్జా చేస్తున్నారని మండిపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణంలో భాగంగా కనీస మౌలిక వసతుల కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీ స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్లే రోడ్డును తవ్వి ఇల్లు నిర్మించడానికి ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సిద్దిపేట అర్బన్ తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా సిబ్బందిని పంపించి చేతులు దులుపుకున్నారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వ స్థలం అని రెవెన్యూ అధికారులు అంగీకరిస్తూనే ప్రజలనే నేరుగా వెళ్లి కలెక్టర్ కు, సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని రెవెన్యూ అధికారులు సూచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వ స్థలాన్ని ఇద్దరు కబ్జా చేయడాన్ని అడ్డుకుంటే వారిని బెదిరించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ కి వెళ్ళిన పోలీసులు కబ్జాదారులను వదిలి ఫిర్యాదుదారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఫోన్ ద్వారా సిద్ధిపేట అర్బన్ తహసిల్దార్ ను ఫోన్ ద్వారా సాంప్రదించే ప్రయత్నం చేయగా సెల్  ఫోన్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా లేదు.