రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా?
రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడమంటే ఇదేనా?
దేశవ్యాప్తంగా నీతి సూత్రాలు.. తెలంగాణలో మరోలా
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నిస్తూ లేఖ పంపారు. పార్టీ ఫిరాయింపుల(Party defections) నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతాని మేనిఫెస్టోలో చెప్పారని హరీశ్ రావు సూచించారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజ్యాంగం చేతబట్టి దేశవ్యాప్తంగా నీతి సూత్రాలు చెప్పారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మరోలా వ్వవహరిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షించడమంటే ఇదేనా?, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని అవకాశవాదం కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.






