2 August, 2026 | 3:48 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

22-06-2024 05:15 PM

హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య వ్యవధి ఎక్కువ ఉండాలని కోరారు. పరీక్షల మధ్య తక్కువ విరామం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. గ్రూప్-2 గ్రూప్ -3 ఉద్యోగాలు కలుపుతామన్న హామీ నిలుపుకోవాలన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్న మాటలకు కట్టుబడాలని హరీశ్ రావు సీఎంని కోరారు. నిరుద్యోగులకు నెలకు రూ, 4 వేల భృతి బకాయిలతో చెల్లించాలన్నారు. చెప్పిన మాట ప్రకారం జీవో నంబర్ 46ను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.