2 August, 2026 | 2:58 AM

నీట్ పై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ

22-06-2024 05:24 PM

న్యూఢిల్లీ : ఎన్టీఏ సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నీట్ 2024 పరీక్ష ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీని వేసినట్లుగా ప్రకటించింది. ఎన్టీఏ పనితీరు మెరుగు కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది.