జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
హైదరాబాద్ : పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలు తెలిపారు. ప్రతి నెల నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్ అధికారుల చూట్టూ తిరగకుండా ఇవ్వాలని కోరినప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసివేసి ఇప్పటికి నాలుగేళ్లు అవుతుందని, పక్కనే ఉన్న మరో భవనంలో ఆసుపత్రిని మర్చినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో రోగుల రద్దీ పెరిగి ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికైనా తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లిఖితపూర్వకంగా హమీ ఇవ్వాలని కోరారు. లేకపోతే జూన్ 24 నుంచి సమ్మెలోకి వెళ్తామని, ఇప్పటికే సమ్మె నోటీసులు జూనియర్ డాక్టర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.






