12 May, 2026 | 4:50 PM

ఎల్లమ్మ ఆశీస్సులతో పుల్లూరు అభివృద్ధి

12-05-2026 04:19 PM

దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు: మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట రూరల్: ఎల్లమ్మ తల్లి దయతో పుల్లూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.8 లక్షలు, ఆలయ ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.

11 ఏళ్ల తర్వాత ఎల్లమ్మ సిద్ధోగం అంగరంగ వైభవంగా నిర్వహించడం గ్రామానికి శుభపరిణామమన్నారు. గీతకార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలోనే వినూత్నంగా ఇరిగేషన్ కాలువలు, చెరువుల ఇరువైపులా ఈత చెట్లను నాటించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు చింతమడక గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు.