నర్సులు అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు
క్లబ్ అధ్యక్షులు పోలవరపు సంతోష్, పీఎస్హెచ్ చైర్మన్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి( విజయ క్రాంతి): దవాఖానాలో నర్సులు అంకితభావంతో పనిచేసినప్పుడు గుర్తింపు లభిస్తుందని, వారు చేస్తున్న సేవలు మరువలేనివని లైన్స్ క్లబ్బు అధ్యక్షులు పాలవరపు సంతోష్ పీఏసీహెచ్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దాకాణాలో ప్రపంచ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని, మొదటి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ నర్సులు సింగం సునీత, నాగలక్ష్మి, అనిత, కవిత ,శారద లను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లి ఒక బిడ్డను ఏ విధంగా సంరక్షించుకుంటాడో, అదేవిధంగా దవాఖానకు వెళ్ళిన రోగులను నర్సుల సేవలు అందిస్తారని కొనియాడారు. ప్రతి నర్సు రోగుల పట్ల అంకితభావంతో పనిచేసినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, పనిచేస్తున్న నర్సులకు ఎల్లవేళలా లైన్స్ క్లబ్ సేవలు అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, కోశాధికారి గుండ గాని రాము కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్ ఎనగందల గిరి, గుడిపూడి లక్ష్మణరావు, పులుసు వెంకటనారాయణ గౌడ్, గుజ్జా భాస్కర్, వాసం అభిలాష్, ఆరోగ్య సిబ్బంది సతీష్, తదితరులు పాల్గొన్నారు.






