21 March, 2026 | 7:26 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

హరీశ్‌రావును అరెస్ట్ చేయాలి

29-10-2024 12:51 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిని కించపరిచేలా మాట్లాడిన మాజీమంత్రి హరీశ్‌రావును అరెస్టు చేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 352, 353/1, 353/2 సెక్షన్ల కింద  ఫిర్యా దు చేసినట్లు చెప్పారు.

ఒక శాసనసభ్యుడిగా ఉన్న హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని ‘చీఫ్‌మెన్’ అని వ్యాఖ్యానించడమేంటని ప్రశ్నించారు. హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.