3 May, 2026 | 2:22 AM

హాష్ ఆయిల్ పట్టివేత

03-05-2026 12:15 AM

ఒరిస్సా నుంచి హైదరాబాద్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని రంగారెడ్డి నగర్‌లో హాష్ ఆయిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు శనివారం రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ బీ టీం సీఐ సుభాష్ చందర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. జనగాం ప్రాంతానికి చెందిన సాకి చక్రపాణి (23) అనే వ్యక్తిని పట్టుకున్నారు.

నిందితుడి వద్ద 1.550 కేజీల హాష్ ఆయిల్ తో పాటు 465 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. చక్ర పాణి ఒడిశా నుంచి గంజాయి, హాష్ ఆశిష్ ఆయిల్‌ను తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడయింది. చక్రపాణిపై కలిమెలా పోలీస్ స్టేషన్ ఒడిశా, మోటు గూడా పోలీస్ స్టేషన్ ఏపీ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ హైదరాబాదులో కేసులు నమోదయి ఉన్నాయి.