10-07-2025 01:41:36 AM
మేడ్చల్, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా జగన్‌మోహన్‌రావును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టికెట్ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యా న్ని ఆయన బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌సీఏ.. ఐపీఎల్ టికెట్లను కోర గా పది శాతం ఇవ్వడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది.
కానీ అదనంగా తనకు టికెట్లు ఇవ్వాలని జగన్‌మోహన్‌రావు డిమాండ్ చేశారు. అంతేగాక మార్చి 27న లక్నో సూపర్ జెయెంట్స్ యజమాని సంజీ గోయాంకకు కేటాయించిన బాక్సును జగన్‌మోహన్‌రావు లాక్ చేశారు. దీంతో ఎస్‌ఆర్ హెచ్ యాజమాన్యం మ్యాచ్‌లను హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తామని హెచ్చరించింది.
దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో విచారణ జరిగిం ది. జగన్‌మోహన్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.