calender_icon.png 10 July, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది

10-07-2025 01:39:42 AM

  1. బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయింది
  2. గత ప్రభుత్వ దారిలోనే కాంగ్రెస్ వెళుతోంది 
  3. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలకు ఏమాత్రం లొంగం
  4. బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ 

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక తనపై అక్రమ కేసులు పెట్టిందని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ అన్నారు. బుధవారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో కేసుల విచారణకు ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. గతంలో పార్లమెంట్ ఎన్నిక ల సమయంలో దోమలగూడ పోలీస్ స్టేష న్, సూర్యాపేట పోలీస్ స్టేషన్లో తనపై కేసు లు నమోదు చేశారని.. అందులో భాగంగా బుధవారం నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరైనట్లు ఆయన తెలిపారు.

బీజేపీ ప్రభంజనా న్ని ఎదుర్కోలేక, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం, ఆ పార్టీ నాయకులు రాచరిక విధానం లో తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించా రు. ఆ వేధింపుల నేపథ్యంలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇప్పుడు అదే మార్గా న్ని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తోందని దుయ్యబట్టారు. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశం కోసం పనిచేస్తున్న నిబద్ధత గల కార్యకర్తలమని, న్యాయస్థానాల పట్ల, ధర్మం పట్ల తమకు సంపూర్ణ నమ్మకం ఉందదన్నా రు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల కక్షసాధింపు చర్యలకు ఏమాత్రం లొంగబోమని స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తూనే ఉంటాని తెలిపారు.