10-07-2025 09:40:08 AM
హైదరాబాద్: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో(Adulterated Toddy Incident) మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కల్తీ కల్లు ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు(Death toll ) విడిచారు. అప్పటికే మౌనిక(25), నారాయణ(42) చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే స్వరూప, సీతారం, బొజ్జయ్య కల్తీ కల్లు కాటుకు మృతి చెందారు. కూకట్ పల్లి కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో మరో ఆరుగురు బాధితులు ఆస్పత్రుల్లో చేరారు.
మరో 31 మంది బాధితులు నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యక్తులు ఆదివారం, మంగళవారం కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లోని వివిధ దుకాణాలలో కల్లు తాగినట్లు భావిస్తున్నారు. వారికి తక్కువ రక్తంలో చక్కెర, తల తిరగడం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. వారు మొదట ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు(Prohibition and Excise Department) సమాచారం అందడంతో, మంగళవారం 12 మందిని నిమ్స్‌కు తరలించారు. బుధవారం ఆ సంఖ్య 31కి పెరిగింది. ఈ విషాదంపై ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.