10-07-2025 09:44:07 AM
హుజురాబాద్:(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్(huzurabad)పట్టణంలోని సాయి కన్వెన్షన్, లాడ్జిల్లో పేకాట రాయులను అరెస్టు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం రాత్రి సాయి కన్వెన్షన్,లాడ్జిలో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా పోలీసులు తనిఖీలు చేయగా 11 మంది పేకాట ఆడుతూ ఉన్నారు. వారిని అరెస్టు చేసి వారి నుండి 18750, రూపాయలు 11 సెల్ ఫోన్లను పేకముక్కలను సీజ్ చేసి, లాడ్జ్ ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.