10-07-2025 08:22:57 AM
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో(Betting Apps Promotion) ఈడీ దూకుడు చూపింది. ఈ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు 4 కంపెనీలపై ఈడీ(Enforcement Directorate) కేసు నమోదు చేసింది. అందులో సినీ నటీనటులతో పాటు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ(Hero Vijay Deverakonda), రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్లు హర్షా సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని లతో పాటు మరికొందరిపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్‌లలో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించారట. దీంతో మనీ లాండరింగ్ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది.