24 March, 2026 | 2:58 AM

సీఎం రేవంత్‌తో హెచ్‌సీఏ ప్రతినిధుల భేటీ

24-03-2026 01:27 AM

హైదరాబాద్, మార్చి 23 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవా రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన లీజును పొడిగించాలని కోరుతూ లేఖ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. సీఎంను కలిసిన వారి లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అమర్‌నాథ్, వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, సెక్రటరీ జీవన్‌రెడ్డి, ట్రెజరర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ కుమార్ అగర్వాల్, మాజీ కోశాధికారి మహేందర్ ఉన్నారు.