30 August, 2026 | 12:57 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ గెయినర్

25-05-2024 12:53 AM

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.7 శాతం పెరిగి రూ. 1,528 వద్ద ముగిసింది. భారతి ఎయిర్‌టెల్, లార్సన్ అండ్ టుబ్రో, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీలు 1.5 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.52 శాతం తగ్గింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.71 శాతం, ఐటీ ఇండెక్స్ 0.55 శాతం, మెటల్ ఇండెక్స్ 0.41 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.35 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున తగ్గాయి. ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకెక్స్‌లు పెరిగాయి. మెటల్ ఇండెక్స్ నష్టంతో ముగిసింది. స్మాల్ క్యాప్ సూచి 0.20 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.23  శాతం పెరిగింది.