30 August, 2026 | 1:59 AM

మీ పిల్లలకు డైపర్లు వాడుతున్నారా?

25-05-2024 12:05 AM

ప్రస్తుత కాలంలో డైపర్ల వాడకం బాగా పెరిగింది. అయితే పిల్లలకు డైపర్లు ఎలా పడితే అలా వాడకూడదంటున్నారు నిపుణులు. వాడితే పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నా రు. మరి డైపర్ ఎలా వాడాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..!

* బట్టతో చేసిన డైపర్లను ఇతర బట్టలతో కలపకుండా వేడి నీటిలో ఉతకాలి.

* పిల్లలు మల విసర్జన చేసిన డైపర్‌ను అలాగే బయటపడేయకూడదు.

* పిల్లలు పాలు తాగిన తర్వాత డైపర్ వేయడం మంచిది. యూరిన్ చేసిన తర్వాత మార్చాలి. లేదంటే చర్మంపై ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

* డైపర్ వేయడానికి ముందు ఆ శరీర భాగంపై పౌడర్ వేయాలనుకుంటే.. చేతితో వేయకూడదు.

* డైపర్ వల్ల ఇన్‌ఫెక్షన్ వస్తే పిల్లలను వెంటనే హాస్పటల్‌కు తీసుకెళ్లి.. వైద్యుల సలహలు తీసుకోవాలి. 

* చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. అదేంటంటే.. డైపర్ వాడకం వల్ల పిల్లల నడకలో ఎలాంటి శాశ్వత మార్పులు ఉండవు. కేవలం అది వాడినప్పుడు మాత్రమే కాళ్లు కొంత ఎడంగా పెట్టి నడుస్తారు. 

* డిస్పోజబుల్ డైపర్ వాడితే పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. యూరిన్ పోసినప్పుడు చర్మానికి తేమ తగలకుండా ఉండటం వల్ల పిల్లలకు టాయిలెట్ అనే విషయమే తెలియదు. టాయిలెట్ పిల్లలు సొంతంగా పోయాల్సిన వయస్సు వచ్చేనాటికైనా బట్టతో చేసిన డైపర్ వాడితే టాయిలెట్ ట్రైనింగ్ సులభమవుతుంది.