29 August, 2026 | 11:06 PM

ఎఫ్‌పీఐల స్వల్ప విక్రయాలు

25-05-2024 12:58 AM

మే నెలలో భారీ అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) గురువారం హఠత్తుగా రూ.4,670 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసి, స్టాక్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడానికి కారణమయ్యారు. అయితే శుక్రవారం మాత్రం ఎఫ్‌పీఐలు రూ. 944 కోట్ల షేర్లను నికరంగా విక్రయించినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 30,000 కోట్ల మేర నిధుల్ని వెనక్కు తీసుకున్నారు.